భారత్‌ ‘ఎ’ లక్ష్యం 262  | Travis Head 87 sets India A 262 to win | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ లక్ష్యం 262 

Published Wed, Sep 5 2018 1:36 AM | Last Updated on Wed, Sep 5 2018 1:36 AM

 Travis Head 87 sets India A 262 to win - Sakshi

బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. చేతిలో మరో 8 వికెట్లు ఉన్న భారత్‌ ఈ మ్యాచ్‌ గెలవాలంటే చివరి రోజు ఇంకా 199 పరుగులు చేయాలి.

మయాంక్‌ అగర్వాల్‌ (25 బ్యాటింగ్‌), అంకిత్‌ బావ్నే (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 42/1తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌ 83.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖాజా (40; 5 ఫోర్లు, 1 సిక్స్‌), హెడ్‌ (87; 13 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ 3, గౌతమ్, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  

సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 243; భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 274; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 292 (హెడ్‌ 87, ఉస్మాన్‌ ఖాజా 40; మొహమ్మద్‌ సిరాజ్‌ 3/77); భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: 63/2 (20 ఓవర్లలో).   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement