మాతో ఆడతారా... లేదా! | Play with us or compensate: PCB threatens BCCI | Sakshi
Sakshi News home page

మాతో ఆడతారా... లేదా!

Published Thu, Nov 10 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM

Play with us or compensate: PCB threatens BCCI

స్పష్టం చేయాలని బీసీసీఐని కోరిన పీసీబీ  
కరాచీ: భారత్ తమతో క్రికెట్ ఆడేది లేనిది స్పష్టం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కోరింది. ఒకవేళ తమతో ఆడకపోతే ఎఫ్‌టీపీని ఉల్లంఘించినందుకు తమకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కేప్‌టౌన్‌లో ఐసీసీ సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సిరీస్‌లపై స్పష్టత ఇవ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు ఠాకూర్‌ను కోరామని... దీనికి ఆయన స్పందించలేదని పీసీబీ అధికారి నజమ్ సేథీ చెప్పారు.

పైగా ఐసీసీ ఈవెంట్లలోనూ భారత్, పాక్‌లను ఒకే గ్రూప్‌లో ఉంచకూడదని ఠాకూర్ కోరడం శోచనీయమని అన్నారు. ఒకవేళ ఐసీసీ ఈవెంట్లలో భారత్ తమతో ఆడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి తమకు పాయింట్లు ఇవ్వాలని ఐసీసీని ఉద్దేశించి అన్నారు. భారత్ తమతో ద్వైపాక్షిక సిరీస్ ఆడకపోతే నష్టపరిహారం చెల్లించాలని, ఐసీసీ కూడా తమకు అదనంగా గ్రాంట్స్ ఇవ్వాలని సేథి అన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement