టీడీపీ కుట్ర; ఇదీ.. అసలు కథ TDP And Yellow Media Drama Reveals YSR Congress party Chittoor | Sakshi
Sakshi News home page

ఇదీ.. అసలు కథ

Published Mon, Mar 16 2020 11:15 AM | Last Updated on Mon, Mar 16 2020 11:22 AM

TDP And Yellow Media Drama Reveals YSR Congress party Chittoor - Sakshi

ఈ క్లిప్పింగ్‌లో రాయి పట్టుకుని వెళుతున్న యువకుడి పేరు ఎన్‌ సద్దాం. పుంగనూరుకు చెందిన ఈ వ్యక్తి సోషల్‌ డెమెక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ) తరఫున 21, 22 వార్డులకు పోటీ చేస్తున్న వారికి మద్దతుగా నామినేషన్‌ సెంటర్‌కు వచ్చారు. నామినేషన్‌ సెంటర్‌లో అప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉండడం, వారు వచ్చిన తర్వాత వెళ్లాలని అధికారులు సూచించడంతో సద్దాం అడ్డుతగిలారు. వారు వచ్చేంత వరకూ మేమెందుకు వేచి ఉండాలంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి చేసేందుకు రాయితో వెళుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఎల్లో మీడియా అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లు చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నా అడ్డుకునే వారు లేరని ఫోకస్‌ చేసింది.

ఈ క్లిప్పింగ్‌లో ఉన్న వ్యక్తి పేరు కె.పద్మనాభం అలియాస్‌ పప్పురాయల్‌. టీడీపీ వర్గీయుడిగా, రౌడీషీటర్‌గా తిరుపతి నగరవాసులకు సుపరిచితుడు. సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉండగా అమెకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లడిస్తూ సోషియల్‌ మీడియాలో పోస్టులు, బ్యానర్లు సైతం వేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను దూషించారని ‘బరితెగింపు’ పేరుతో టీడీపీ నేత మన్నెం శ్రీనివాసులపై వైఎస్సార్‌సీపీ నేత దాడి చేసినట్లు ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. వాస్తవానికి పప్పురాయల్, మన్నెం శ్రీనివాసులు ఇరువురు చిన్ననాటి స్నేహితులు. ఇప్పటికీ కలిసిమెలిసే ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేను దూషించారంటూ, మన్నెం శ్రీనివాసులపై దాడి చేశారంటూ వండివార్చింది.

పప్పుయాదవ్‌ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు

ఈ రెండు క్లిప్పింగ్స్‌ పరిశీలిస్తే ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ, ఎల్లో మీడియా ఎలా కుట్ర చేసిందో ఇట్టే అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వార్తలను తమకు అనుకూలంగా వండి వార్చాయి. వాటినే ఎన్నికల అధికారి పరిగణనలోకి స్వీకరించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్ష చర్యలు చేపట్టారని పలువురు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్‌ నారాయణగుప్తా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డితో పాటు పలువురు అధికారుల బదిలీల నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.

రోజుకొక దుష్ప్రచారం
‘తస్కరించు.. తిరస్కరించు.. బహిష్కరించు.. మూడంచెల కుట్ర’ ప్రజాస్వామ్యానికి పునాది రాయి.. ఇలా రోజుకొక వార్త వండివార్చడం. వాటినే సుమోటోగా రాష్ట్ర ఎన్నికల అధికారి స్వీకరించడం వెనుక కుట్రకోణం బహిర్గతమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప వివాదాలు సర్వసాధారణం. ఎన్నికలు వాయిదా పడాలనే టీడీపీ సంకల్పానికి ఎల్లో మీడియా అండగా నిలిచింది. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. జిల్లావ్యాప్తంగా దౌర్జన్యకర ఘటనలు తీవ్రంగా ఉన్నట్లు ఫోకస్‌ చేసింది. (ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?!)

ప్రజాభిమానం లేకపోవడంతో..
తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. అందుకు కారణం గడిచిన ఐదేళ్లలో నియంతృత్వం రాజ్యమేలడం, ఓ వర్గం వారినే సంక్షేమ పథకాలకు అర్హులుగా ఎంపిక చేయడం, రాష్ట్రాభివృద్ధి లేకపోగా టీడీపీ కార్యకర్తల ఉన్నతికి మాత్రమే పనిచేయడం లాంటవని పలువురు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం హోదాలో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 6నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ వర్తింపజేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 59 శాతం సీట్లు కేటాయించాలని రిజర్వేషన్‌ రూపొందించారు. 50 శాతానికి మించి సీట్లు ఇవ్వరాదంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డితో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో కేసు వేయించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్‌సీపీ టికెట్ల కేటాయింపులో 34 శాతం బీసీలకు దక్కేలా చర్యలు చేపట్టింది.

స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ టీడీపీయే
కరోనా వైరస్‌ స్వైన్‌ప్లూ, యబోలా, సార్స్‌ వైరస్‌ కంటే ప్రమాదకరమైంది కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాలో 2శాతం కూడా మరణాలు లేవని, యబోలా వైరస్‌ వల్ల 30శాతం మరణాలు తలెత్తాయని వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకారిగా ప్రచారం చేస్తూ దాని ఆధారంగానే ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ తెలుగుదేశం పార్టీయేనని పలువురు వెల్లడిస్తున్నారు. మార్చిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి దాదాపు రూ.5వేల కోట్లు లభించే అవకాశం ఉంది. ఆ నిధులు రాకుండా ఉండాలనే కుట్రను తెలుగుదేశం పన్నిందని పలువురు మేధావులు భావిస్తున్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాలు వాయిదా వేయడం తదితర నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. (చదవండి: ఆరువారాల కుట్ర!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement