హస్తినకు ఎక్స్‌అఫీషియో పంచాయితీ | State Election Commission Seeks Clarification On MPs Vote | Sakshi
Sakshi News home page

హస్తినకు ఎక్స్‌అఫీషియో పంచాయితీ

Published Fri, Jan 31 2020 4:50 AM | Last Updated on Fri, Jan 31 2020 4:50 AM

State Election Commission Seeks Clarification On MPs Vote - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో తలెత్తిన ఎక్స్‌ అఫీషియో ఓటు వివాదం హస్తినకు చేరింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు ఎక్కడ ఓటు వేయాలనే విషయం పై దుమారం రేగింది. తమకు తెలంగాణ లో ఎక్స్‌ అఫీషియో ఓటు ఉందని ఇద్దరూ గట్టిగా వాదిస్తుండటంతో స్పష్టత కో రుతూ ఎస్‌ఈసీ రాజ్యసభ సెక్రటేరియట్‌ కు అధికారిక లేఖ రాసింది.

కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం 
ఏపీకి కేటాయించిన ఎంపీ కేకే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పురపాలికలో ఎక్స్‌ అఫీషియో ఓటేయడం సరికాదంటూ కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మున్సిపాలిటీలో ఏపీకి చెందిన ఎంపీ కేవీపీని ఎక్స్‌అ ఫీషియో సభ్యుడిగా నమోదుచేశాక, దా నిని మొదట నేరెడుచర్ల మున్సిపల్‌ కమిష నర్‌ తిరస్కరించారు. ఈ అంశాన్ని కాంగ్రె స్‌ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో పా టు ఎస్‌ఈసీని ఆశ్రయించగా ఆయనకు అ క్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎస్‌ఈసీ ని ర్ణయం తీసుకుంది. మధ్యలో జాప్యంతో చైర్‌పర్సన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌ ఎన్నిక మరుసటిరోజుకు వాయిదా పడింది. దీనిపై ఎస్‌ఈసీ అసంతృప్తి తెలపడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ బదిలీ, నేరెడుచర్ల ఇన్‌చార్జీ మున్సిపల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తూ సర్కార్‌ ఉత్తర్వులిచ్చింది. నేరెడుచర్ల చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ మొదలయ్యాక కొత్తగా ఎమ్మెల్సీ శేరీ సుభాష్‌రెడ్డిని ఎక్స్‌ అఫీషియోసభ్యుడిగా చేర్చడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం తెలిపింది. చివరకు ఈ ఎన్నికను ఆ పార్టీ బహిష్కరించడంతో కేవీపీ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు.

తెలంగాణకు కేవీపీ.. ఏపీకి కేకే 
కేవీపీని తెలంగాణకు, కేకేను ఏపీకి కేటాయించారని, తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన 2020 డైరీలోనూ, కేవీపీ తెలంగాణకు చెందుతారని రాజ్యసభ వెబ్‌సైట్లో ఉందని ఎస్‌ఈసీ వర్గాలు తెలిపాయి. తుక్కుగూడలో కేకే తమ ఓటుహక్కును వినియోగించుకోగా, కేవీపీ కూడా నేరెడుచర్లలో ఓటేసి ఉంటే వివాదం సంక్లిష్టంగా తయారై ఉండే దని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మున్సిపోల్స్‌ నిర్వహణ సరిగా లేదని అధికారపక్షానికి అనుకూలంగా ఎస్‌ ఈసీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఏకంగా కమిషనర్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సెక్రటేరియట్‌ నుంచి కేవీపీ, కేకే ఎక్స్‌అఫీషియో సభ్యత్వాలపై ఎలాంటి వివరణ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement