ముజఫర్‌నగర్‌ కేసుల ఎత్తివేత? | Uttar Pradesh considers withdrawing Muzaffarnagar riots case | Sakshi
Sakshi News home page

ముజఫర్‌నగర్‌ కేసుల ఎత్తివేత?

Published Mon, Jan 22 2018 4:40 AM | Last Updated on Mon, Jan 22 2018 4:40 AM

Uttar Pradesh considers withdrawing Muzaffarnagar riots case - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ అల్లర్ల కేసులో బీజేపీ నేతలపై ఉన్న కేసులు ఎత్తేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సిద్ధమయ్యారు. కేసుల ఎత్తివేతపై ముజఫర్‌నగర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌తో పాటు ఎస్‌ఎస్పీ అభిప్రాయాలను కోరుతూ యూపీ ప్రభుత్వం ఈ నెల 5న లేఖ రాసినట్లు తెలిసింది. ముజఫర్‌నగర్‌ అల్లర్లలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు సంబంధించి ప్రస్తుత యూపీ మంత్రి సురేశ్‌ రాణా, మాజీ కేంద్ర మంత్రి సంజీవ్‌ బాల్యన్, ఎంపీ భరతేందు సింగ్, ఎమ్మెల్యే ఉమేశ్‌ మాలిక్, సాధ్వీ ప్రాచీలపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement