పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు | Sheena Bora Case: Peter Mukerjea Undergoes Lie Detector Test | Sakshi
Sakshi News home page

పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు

Published Sat, Nov 28 2015 5:20 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో స్టార్ గ్రూప్ మాజీ సిఈవో పీటర్ ముఖర్జియాకు అధికారులు శనివారం లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత పది రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ప్రశ్నించినా.. సీబీఐ అధికారులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. విచారణకు సహకరించని నేపథ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
 
Advertisement