![5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్](/sites/default/files/styles/webp/public/article_images/2017/09/17/81504512204_625x300.jpg.webp?itok=t1VMHmM3)
లక్నో: ఉత్తర ప్రదేశ్ జిల్లా కోర్టులోని లిఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.
వజీర్గంజ్ జిల్లా కోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్ సడెన్గా కూలిపోవడంతో భయాందోళణ వాతావరణం నెలకొంది. వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది.