60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ 23 | Mahesh babu, murugadoss movie update | Sakshi
Sakshi News home page

60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ 23

Published Thu, Nov 3 2016 3:24 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ 23 - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు, సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి 60 శాతం షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. ఈ నెల 14 వరకు హైదరాబాద్ పరిసరా ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసి తరువాతి షెడ్యూల్ కోసం అహ్మదాబాద్ వెళ్లనున్నారు. అహ్మదాబాద్లో జరగనున్న భారీ షెడ్యూల్తో దాదాపు సినిమా షూటింగ్ పూర్తి కానుంది.

ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అదే స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య విలన్గా నటిస్తున్నాడు. మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement