సంపన్న దేశాల్లోనే తగినంత ఆక్సిజన్‌ | Scarce Medical Oxygen Worldwide Leaves Many Gasping For Air | Sakshi
Sakshi News home page

సంపన్న దేశాల్లోనే తగినంత ఆక్సిజన్‌

Published Thu, Jun 25 2020 8:20 AM | Last Updated on Thu, Jun 25 2020 8:26 AM

Scarce Medical Oxygen Worldwide Leaves Many Gasping For Air - Sakshi

కోనాక్రి(గినియా) : కరోనా వైరస్‌ కారణంగా తీవ్రమైన ఆక్సిజన్‌ కొరత ప్రపంచవ్యాప్తంగా కఠోర వాస్తవాలను వెలికితెస్తోంది. సంపన్న దేశాలైన యూరప్, ఉత్తర అమెరికాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్‌ మాదిరిగా ఆక్సిజన్‌ను ప్రాథమిక అవసరంగా గుర్తిస్తారు. ఇక్కడ ద్రవరూపంలో పైప్‌ల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని కోవిడ్‌ రోగుల బెడ్స్‌కి ఆక్సిజన్‌ చేరుతుంది. అయితే పెరు నుంచి బంగ్లాదేశ్‌ వరకు పేద దేశాల్లో ఆక్సిజన్‌ కొరత ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ప్రపంచ జనాభాలో కనీసం సగం మందికి ఆక్సిజన్‌ అందుబాటులో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగోలో కేవలం 2 శాతం ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉంది. టాంజానియాలో 8 శాతం, బంగ్లాదేశ్‌లో 7 శాతం ఉన్నట్టు ఒక సర్వేని బట్టి తెలుస్తోంది. గినియాలో ఏ ఆసుపత్రలో ఒక్క బెడ్‌కి నేరుగా ఆక్సిజన్‌ సరఫరా సదుపాయం లేదు. (ప్రపంచంలో రికవరీ @ 50లక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement