ఎన్నికలు అనుమానాస్పదం: అమెరికా | pak Elections are susceptible | Sakshi
Sakshi News home page

ఎన్నికలు అనుమానాస్పదం: అమెరికా

Published Fri, Jul 27 2018 4:06 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

pak Elections are susceptible - Sakshi

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌లో ఎన్నికలు జరిగిన తీరుపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సాధారణ ఎన్నికల్లో పారదర్శకత కొరవడిందని.. ఆర్మీ మద్దతున్న పీటీఐ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. ‘ఎన్నికల్లో పారదర్శకత లోపించిందని అర్థమవుతోంది. పీటీఐ మినహా మిగిలిన పార్టీల ఏజెంట్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని ప్రభావమే ఈ ఫలితాలు’ అని అమెరికా విదేశాంగ ఉన్నతాధికారి అలేసా ఎయిర్స్‌ అభిప్రాయపడ్డారు. ‘ప్రభుత్వం మారుతున్నా పాకిస్తాన్‌ ప్రజాస్వామ్యం ఇంకా మిలటరీ పాలనలోనే కొనసాగుతుంది. ప్రభుత్వం కేవలం తోలుబొమ్మ మాత్రమే’ అని హెరిటేజ్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ జెఫ్‌ స్మిత్‌ పేర్కొన్నారు. పలువురు అమెరికా–పాకిస్తాన్‌ సంబంధాల నిపుణులు కూడా ఎన్నికల్లో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు ముందుగా ఊహించినవేనని అమెరికాలో పాకిస్తాన్‌ మాజీ రాయబారి హుసేన్‌ హక్కానీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement