మ‌నం నిద్రిస్తే క‌రోనా కూడా నిద్రిస్తుంద‌ట‌! | Coronavirus Will Sleep When We Sleep: Pakistan Politician | Sakshi
Sakshi News home page

'నిద్రలో క‌రోనా ఎలాంటి హాని చేయ‌దు'

Published Mon, Jun 15 2020 11:34 AM | Last Updated on Mon, Jun 15 2020 12:15 PM

Coronavirus Will Sleep When We Sleep: Pakistan Politician - Sakshi

కరాచీ: ప్రాణాంత‌క‌ క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను కుదిపేస్తోంది. తొలుత భారత్‌లో  న‌మోదైన కేసుల సంఖ్య‌ లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో విప‌రీతంగా పెరిగిపోయింది. అటు పొరుగు దేశ‌మైన పాకిస్తాన్ క‌రోనాను ఎదుర్కోలేక ప‌త‌న‌మ‌వుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్ర‌మంలో అక్క‌డ ఓ రాజ‌కీయ నాయ‌కుడు వైర‌స్‌పై విచిత్ర‌ వ్యాఖ్య‌లు చేశారు. "నువ్వు ఎంత‌సేపు పడుకుంటే క‌రోనా అంత‌సేపు నిద్రిస్తుంది. మ‌నం చ‌నిపోతే క‌రోనా చ‌నిపోతుంది. అంతే.. " (పాకిస్తాన్‌ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్‌)

"నిద్రించే స‌మ‌యంలో వైర‌స్ ఎలాంటి హాని చేయ‌దు. పైగా వైర‌స్ వ్యాప్తిని నిరోధించ‌డానికి ఎక్కువ గంట‌లు నిద్ర‌పోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేష‌న‌ల్ అసెంబ్లీ స‌భ్యుడు ఫ‌జ‌ల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జ‌ర్న‌లిస్టు నైలా ఇనాయ‌త్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాట‌లు వింటే క‌రోనా నిజంగానే చ‌నిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంత‌కీ ప‌రిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మ‌నం నిద్ర‌పోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement