నయా హెయిర్‌ స్టైల్‌.. 40 మిలియన్ల వ్యూస్‌ Barbers Blazing Haircut With Fire Is Viral On Social Media | Sakshi
Sakshi News home page

మంటతో హెయిర్‌స్టైల్‌, ఫిదా అవుతోన్న నెటిజన్లు

Published Tue, Jan 28 2020 9:59 AM | Last Updated on Tue, Jan 28 2020 1:12 PM

Barbers Blazing Haircut With Fire Is Viral On Social Media - Sakshi

కురులపైనా శ్రద్ధ కేవలం అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి అబ్బాయిలు  కూడా  జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. ఉన్న కొంచెం జుట్టు అయినా రకరకాలుగా సోకులు పడుతుంటారు. జుట్టును అటు వేసి.. ఇటు వేసి.. సగం కత్తిరించి వివిధ స్టైల్లో తిప్పుతుంటారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది ఇంకేదో కొత్తదనం కావాలి అని అనుకుంటారు. అలా అనుకునే వారి కోసమే ఓ హెయిర్‌ స్టైల్‌ నిపుణుడు వెరైటీగా ట్రై చేశాడు. తన దగ్గరికి వచ్చన ఓ కస్టమర్‌కు జుట్టును స్టైల్‌ చేయడానికి మంటను ఉపయోగించాడు. జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్‌గా క్రాఫ్‌ చేశాడు. అయితే కస్టమర్‌కు మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఈ వీడియోను మొదటగా టిక్‌టాక్‌లో నవంబర్‌లో ప్రకాశ్‌ అనే వ్యక్తి షేర్‌ చేశారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇండియాలోనే జరిగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనిని టిక్‌టాక్‌లో 30 మిలియన్ల మంది వీక్షించగా.. ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ షేర్‌ చేస్తున్నారు. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూశారు. కాగా దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ఒక్కసారైనా ఇలాంటి హెయిర్‌ స్టైయిల్‌ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇంట్లో ఇలాంటివి చేయకండంటూ కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement