శునకం... ఓ ఫుల్ మీల్స్ | peoples are feel pet dogs as status symbol | Sakshi
Sakshi News home page

శునకం... ఓ ఫుల్ మీల్స్

Published Sat, Nov 22 2014 11:42 PM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

శునకం...  ఓ ఫుల్ మీల్స్ - Sakshi

చాలామంది తాము జంతు ప్రేమికులమని చాటుకోవడానికి గొప్ప గొప్ప జాతి శునకాలను పెంచుకోవడం ప్రస్తుతం స్టేటస్ సింబల్‌గా చలామణీలో ఉంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ, పలువురిని నేను దగ్గరి నుంచి పరిశీలించినప్పుడు వాటి పట్ల ఆయా యజమానులకు ఉన్న ‘ప్రేమ’ కళ్లకు కట్టింది.

తాము తిని వదిలేసిన, మిగిలిపోయిన ఆహారాన్ని తమ పెంపుడు శునకాలకు పెట్టడం చూశాను. శునక ప్రేమికులకు నేను చెప్పేది ఒక్కటే.. ‘వాటిని పోషించే స్థోమత లేకుంటే, వాటికి సరైన తాజా ఆహారాన్ని పెట్టలేకుంటే వాటిని పెంచుకోకండి. పెంచుకునేటట్టయితే వాటికి సంబంధించిన ఆహార నియమాలను పాటించండి’.

నేను ఒకసారి చందానగర్ గంగారంలోని సరస్వతి కర్రీ పాయింట్‌లో మధ్యాహ్నం భోజనం చేసి.. నేను తిన్న విస్తరిని బయట వేశాను. అంతలో ఒక శునకం అక్కడకు వచ్చి ఆ విస్తరిలో ఆత్రుతగా తలదూర్చింది. వెంటనే ఒక భోజనం పార్శిల్ కొని దాని ఎదుట ఉంచాను. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తి ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించాడు. శునకం విశ్వాసపాత్రమైన జంతువు. దానిని తక్కువగా చూడొద్దు.

- ఏరువ ఆరోగ్యరెడ్డి ఆగపేట గ్రామం, నర్మెట్ట, వరంగల్ జిల్లా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement