ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్ | New ETF to monetise government stake in listed PSUs, other firms | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్

Published Wed, Jun 22 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ప్రభుత్వం నుంచి రెండో ఈటీఎఫ్

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)ను ప్రారంభించాలని యోచిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి అదనపు మార్గంగా ఈ కొత్త ఈటీఎఫ్‌ను తేవాలనేది ఆర్థిక శాఖ ఆలోచన. 2014, మార్చిలో ప్రభుత్వం తొలి ఈటీఎఫ్‌ను ప్రారంభించింది.

సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్(సీపీఎస్‌ఈ)  ఈటీఎఫ్ పేరుతో అందించిన ఈ ఈటీఎఫ్‌లో 10 ప్రభుత్వ రంగ షేర్లున్నాయి. ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం రూ.3,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతమున్న ఈ  సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు అదనంగా మరో కొత్త ఈటీఎఫ్ కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదిత ఈటీఎఫ్ ఏర్పాటు నిమిత్తం సలహాదారుల నుంచి బిడ్స్ కోరింది. వచ్చే నెల 11లోపు బిడ్స్ సమర్పించాలని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement