పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు | Karnataka Businessman Jailed for Rs 7.35 cr Tax Default  | Sakshi
Sakshi News home page

పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు

Published Sat, Feb 16 2019 2:04 PM | Last Updated on Sat, Feb 16 2019 2:19 PM

Karnataka Businessman Jailed for Rs 7.35 cr Tax Default  - Sakshi

సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత  కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్‌ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను  బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ  అధికారులు  అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది.

ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో   అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.  సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్‌ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం  మినహా,  అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా  వెల్లడించలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement