జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! | Gujarati Businessman Lost 23 Kg In 10 Months Without Gym Or Fancy Diet | Sakshi
Sakshi News home page

జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట!

Published Mon, Jun 24 2024 11:03 AM | Last Updated on Mon, Jun 24 2024 12:41 PM

Gujarati Businessman Lost 23 Kg In 10 Months Without Gym Or Fancy Diet

గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త  ఫిట్‌నెస్‌ జర్నీ ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. జిమ్‌కి వెళ్లకుండా, ఫ్యాన్సీ డైట్‌ని అనుసరించకుండానే 10 నెలల్లో 23 కిలోల బరువు తగ్గించు కున్నాడు. దీంతో అంతకుముందు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు కాస్త, నాజూగ్గా మారిపోయాడు.

వ్యాపారవేత్త నీరజ్‌  బరువు తగ్గేందుకు ఎలా నియమాలు పాటించింది  వరుస పోస్ట్‌ల ద్వారా ఫిట్‌నెస్ కన్సల్టెంట్, సతేజ్ గోహెల్ వివరించారు. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్‌ చేశాడు.  గోహెల్‌ అందించిన వివరాల ప్రకారం కేవలం ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తింటూ, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ నీరజ్‌ అనుకున్న లక్ష్యాన్ని చేరుకో గలిగాడు.

వృత్తి రీత్యా  బిజీగా ఉండే  నీరజ్‌ మొదట తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు.  తరువాత కూడా అనుభవం లేక జిమ్‌కి వెళ్లడానికి సంకోచించేవాడు. దీంతో అతని కోసం ఇంట్లో వినియోగించుకునేలా డంబెల్స్‌ తయారు చేసి ఇచ్చాడు గోహెల్‌. అలాగే ఇంటి ఫుడ్‌ సాధారణ నడక అలవాటు చేశాడు.  మొదట్లో నీరజ్ 10 వేల అడుగులు వేయడానికి చాలా కష్టపడే వాడు. కానీ ఆ తరువాతికాలంలో నడక అలవాటుగా మారిపోయింది.

ఫలితంగా 10 నెలల్లో  నీరజ్‌  23 కేజీల బరువు తగ్గాడు. 91.9 కేజీల నుంచి 68.7 కేజీలకు ఆయన బరువు దిగివచ్చింది. ఆహారంలో పనీర్, సోయా చంక్స్, పప్పు, ఇతర శాఖాహార ప్రోటీన్ ఫుడ్‌ ఎక్కువగా తీసుకునేవాడట. దీంతోపాటు చక్కెర పదార్థాలను బాగా తగ్గిం చేశాడు.  ఇది పూర్తిగా టీం వర్క్‌, వారం వారం అతనితో టచ్‌లో ఉంటూ, అతనికిష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వర్కౌట్‌లు ప్లాన్‌ చేసినట్టు గోహెల్‌ తన పోస్ట్‌లో వెల్లడించాడు. 

అయితే దీనిపై నెటిజన్టు భిన్నంగా స్పందించారు. నీరజ్‌  సంకల్పాన్ని కొందరు ప్రశంసించగా, ఫిట్‌నెస్‌ పరిశ్రమ గురించి గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉందంటూ  మరొకరు విమర్శించారు.

ముఖ్యంగా ‘‘నో నూట్రిషనిస్ట్‌, నో వర్కౌట్..నో నాన్‌ వెజ్‌ ..గురూ..(పోషకాహార నిపుణుడు లేడు, వర్కౌట్లు లేవు, మాంసాహారం  లేదు గురు) డైటింగ్‌ అస్సలే లేదు.. కేవలం చురుకైన నడక, సైక్లింగ్, రోజువారీ 900-1000 కిలోల కేలరీలు బర్నింగ్ అని మరో యూజర్‌ ఒక పోస్ట్‌ పెట్టడం గమనార్హం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement