హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా Collector Praveen Kumar comments about high court judgment | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా

Published Mon, Mar 20 2017 2:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తా - Sakshi

విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: కోర్టు ఆదేశాల మేరకే జూపిటర్‌ ఆటోమొబైల్స్‌ సంస్థకు భవన నిర్మాణం కోసం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశామని విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు 30 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆదివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూపిటర్‌ ఆటో మొబైల్స్‌ సంస్థ భవన నిర్మాణానికి 2009లో దరఖాస్తు చేసిందని, వివిధ కారణాల వల్ల జాప్యం జరగ్గా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిందన్నారు.
 

విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష

ఆ సంస్థకు నాలుగు వారాల్లో అనుమతులు మంజూరు చేయాలని హైకోర్టు 2014 డిసెంబర్‌లో ఆదేశించిన విషయం వాస్తవమేనన్నారు. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో అనుమతుల మంజూరులో జాప్యం జరిగిందని, అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు మంజూరు చేశామన్నారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్తానని స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement