భానుడు భగభగ.. జనం విలవిల | - | Sakshi
Sakshi News home page

భానుడు భగభగ.. జనం విలవిల

Published Sat, Apr 20 2024 1:35 AM | Last Updated on Sat, Apr 20 2024 1:35 AM

వడగాలుల కారణంగా ముఖానికి స్కార్ప్‌ 
కట్టుకొని వెళ్తున్న యువతి  
 - Sakshi

భువనగిరిటౌన్‌ : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సగం మండలాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా వలిగొండలో 43.8, ఆలేరు 43.7, ఆత్మకూర్‌(ఎం) మండంలో 43.1 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోత్కూరు 42.9, రామన్నపేట 42.9, యాదగిరిగుట్ట 42.6, గుండాల 42.5, చౌటుప్పల్‌ 42.0, భువనగిరి 42, సంస్థాన్‌నారాయణపురంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్‌ అయ్యింది.

ఉక్కపోతకు తట్టుకోలేక..

శుక్రవారం తీవ్రమైన వడగాలులకు ఉక్కపోత తోడవడంతో జనం అల్లాడిపోయారు. ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చున్నా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించలేదు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది.ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉన్నందున ఇంట్లో ఉన్నప్పటికీ వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

ఫ సగానికి పైగా మండలాల్లో

42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు

ఫ మున్ముందు మరింత పెరిగే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement