సీఎంపై దాడి హేయమైన చర్య | - | Sakshi
Sakshi News home page

సీఎంపై దాడి హేయమైన చర్య

Published Wed, Apr 17 2024 12:25 AM | Last Updated on Wed, Apr 17 2024 12:25 AM

తిరుమల ఆలయం వెలుపల మాట్లాడుతున్న 
ఎమ్మెల్యే మల్లాది విష్ణు    - Sakshi

తిరుమల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం హేయమైన చర్య అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆయన సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. బస్సు యాత్ర కొనసాగకుండా భయపెట్టాలని.. హత్యాయత్నం చేయాలని ఒక రకమైన కుట్రతో దాడి చేశారన్నారు. సీఎంకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారన్నారు. రాళ్లతో కొట్టమని ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కూటమి ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఓడిపోతామన్న భయంతో సీఎం జగన్‌పై దాడిచేయించారని, ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ పథకాలను కాపీ కొట్టి తాను ఇస్తానంటే ప్రజలు నమ్మరన్నారు. ఈ సారి 175 కు 175 వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయమన్నారు. పురంధేశ్వరి, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌, సుజనాచౌదరి, సీఎం రమేష్‌ ఓడిపోవడం కూడా ఖాయమని జోస్యం చెప్పారు.

శ్రీవారి దర్శనానికి

10 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 77,511 మంది స్వామివారిని దర్శించుకోగా, 26,553 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.28 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.

మద్యం రహిత

ఎన్నికలే లక్ష్యం

సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా నగదు డంపింగ్‌లు, మద్యం నిల్వలు ఉన్నాయని తెలిసిన వెంటనే సిబ్బంది దాడులు నిర్వహించాలని, అలాగే మద్యం రహిత ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలను అందరూ పాటించాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేసీ హెడ్‌క్వార్టర్స్‌ మంగళగి బీ.ఆరుణారావు తెలిపారు. మంగళవారం ఆయన సూళ్లూరుపేటకు విచ్చేసి తడ ఇంటిగ్రేటెడ్‌ వద్ద, బూదనం టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం సూళ్లూరుపేట సెబ్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. తర్వాత ఆయన స్థానిక విలేకరులతో మాట్డాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో డీపీఎల్‌, ఎన్‌డీపీఎల్‌, ఐడీ, ఎండీపీఎస్‌కు సంబంఽధించి పక్కా సమాచారంతో డంపింగ్‌, అధిక మద్యం నిల్వలపై దాడులు నిర్వహించాలన్నారు. డీపీఎల్‌కి సంబంధించిన కేసుల్లో ముద్దాయిలను విచారించి సంబంఽధిత జీఆర్‌ఓ నుంచి అధికంగా మద్యం కొనుగోలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏఈఎస్‌ జీ.నరసింహారావు, తిరుపతి అడిషినల్‌ ఎస్పీ ఏ.రాజేంద్ర, సెబ్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మాట్లాడుతున్న మంగళగిరి సెబ్‌ జేసీ ఆరుణారావు
1/1

మాట్లాడుతున్న మంగళగిరి సెబ్‌ జేసీ ఆరుణారావు

Advertisement
 
Advertisement
 
Advertisement