పోటెత్తిన ప్రజాభిమానం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ప్రజాభిమానం

Published Tue, Apr 16 2024 1:35 AM | Last Updated on Tue, Apr 16 2024 1:35 AM

- - Sakshi

చంద్రగిరి(తిరుచానూరు): తుడా చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజాభిమానం వెల్లువెత్తింది. మా కోసం.. మా ఊరికి.. మా మోహిత్‌రెడ్డి విచ్చేసారంటూ హోరెత్తింది. సోమవారం తిరుచానూరు పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అడుగడుగునా గజ మాలలు వేస్తూ.. పూల వర్షం కురిపిస్తూ ఆత్మీయతను చాటుకున్నారు. అనంతరం మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం్ఙ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని అనిపిస్తోందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వలంటీర్‌ వ్యవస్థ ముందుకు వస్తే.. కుట్ర పూరితంగా ప్రతిపక్ష కూటమి ఫిర్యాదులతో ప్రజలను ఇబ్బందులకు గురుచేశారని ఆరోపించారు. నేడు వలంటీర్లు ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జూన్‌ 4 తర్వాత వలంటీర్ల పునఃనియామక ప్రక్రియపై తొలి సంతకం చేస్తానని ఇప్పటికే సీఎం జగనన్న స్పష్టం చేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడు హోదాకు చంద్రబాబు నాయుడు అనర్హుడని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో కన్నెత్తి కూడని ప్రతిపక్ష నాయకుడు నేడు ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. మన పార్టీ వైఎస్సార్‌సీపీ.. మన గుర్తు ఫ్యాన్‌ గుర్తు అంటూ ప్రజలకు తెలియజేశారు. మన ప్రాంత మరింత అభివృద్ధికి కృషి చేస్తానని.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ యశోద, శ్రీపరాశరేశ్వర ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ నరేష్‌రెడ్డి, శంకర్‌, బుజ్జిరెడ్డి, మునీంద్ర, వాసు, లోకేష్‌ రెడ్డి, నాయక్‌, రాజేంద్ర, గుణ, విజయలక్ష్మీ, తిరుచానూరు, యోగిమల్లవరం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

మా కోసం.. మా ఊరికి.. మా మోహిత్‌

అడుగడుగునా నీరాజనం

తిరుచానూరులో ఆత్మీయ స్వాగతం

No comments yet. Be the first to comment!
Add a comment
1/2

2/2

Advertisement
 
Advertisement
 
Advertisement