● సీఎం వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండించిన నేతలు ● కొవ్వొత్తుల ర్యాలీలు.. నల్లబ్యాడ్జీలతో ప్రదర్శనలు ● కూటమి పార్టీలపై వెల్లువెత్తిన నిరసనలు ● హత్యా రాజకీయాలు మానుకోవాలంటూ ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

● సీఎం వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండించిన నేతలు ● కొవ్వొత్తుల ర్యాలీలు.. నల్లబ్యాడ్జీలతో ప్రదర్శనలు ● కూటమి పార్టీలపై వెల్లువెత్తిన నిరసనలు ● హత్యా రాజకీయాలు మానుకోవాలంటూ ఆందోళనలు

Published Mon, Apr 15 2024 1:20 AM | Last Updated on Mon, Apr 15 2024 1:20 AM

- - Sakshi

జగన్‌పై రాళ్ల దాడి

ప్రతి పేద గుండెకూ తగిలింది!

‘సంక్షేమ సారథి, ప్రజాసేవకుడు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన రాళ్ల ప్రతి పేదవాడి గుండెకూ తగిలింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ రాళ్లదాడి చేయించారు. వాళ్లిద్దరూ నిర్వహించే ప్రతి సభలోనూ జగన్‌ను అంతమొందిస్తామని చెప్పడం వెనుక వారి హత్యారాజకీయాలు అర్థమవుతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో కుట్రపూరిత, హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, పవన్‌లు జగనన్నను రాళ్లతో కొట్టించారు.. వారిని రాష్ట్ర ప్రజలు ఓట్లుతో కొడతారు’. అని టీటీడీ చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు.

తిరుపతి అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం విజయవాడలో జరిగిన రాళ్లదాడిపై జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఆదివారం ఈమేరకు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

శ్రీకాళహస్తి : ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టనంలోని 16వ వార్డు నుంచి 20వ వార్డుల్లో నల్లబ్యాడ్జీలతోనే ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ కమిటీ చైర్మన్‌ అంజూరు శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ మిద్దెల హరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, నేతలు సిరాజ్‌బాషా, గోరా పాల్గొన్నారు.

చంద్రగిరి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యవేడు : నియోజకవర్గంలోని నారాయణవనంలో వైఎస్సార్‌ సర్కిల్‌, అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూతతోటి రాజేష్‌ నిరసన తెలిపారు. కార్యక్రమంలో నేతలు దివాకర్‌రెడ్డి, సొరకాయలు, వెంకటరమణ, అన్నాదొరై పాల్గొన్నారు.వరదయ్యపాళెంలో పార్టీ మండల కన్వీనర్‌ దయాకర్‌రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు.

సూళ్లూరుపేట : ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నేతృత్వంలో నిరసన చేపట్టారు.చంద్రబాబు నీచమైన రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు సత్యనారాయణరెడ్డి, బాలచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

వెంకటగిరి : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కూటమి నేతలు హింసాత్మక రాజకీయాలు మానుకోవాలని కోరారు.

గూడూరు : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్‌ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. గూడూరు రూరల్‌లోని రామలింగాపురంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతల వైఖరిపై పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ముస్లింలు నిరసన తెలిపారు.

బాబు, పవనే కారకులు

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడికి కారకులు చంద్రబాబు, పవన్‌కళ్యాణే అని టీటీడీ చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే వారు చేసిన రెక్కీ మాత్రమే ఇది అన్నారు. విజయవాడలో శనివారం రాత్రి సీఎం వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక జీవకోన వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి స్థానికులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. భూమన కరుణాకరరెడ్డి నల్ల కండువా కప్పుకుని, భూమన అభినయ్‌ నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేకనే... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ హత్యారాజయాలు నశించాలని డిమాండ్‌ చేశారు. రెండు మూడు నెలల నుంచి జగన్‌ మోహన్‌రెడ్డిని అంతం చేస్తాం అని వీళ్లిద్దరూ అంటున్నారని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా రాజకీయల్లో ఎదుర్కొనే శక్తి లేక, భౌతికంగా అంతమొందించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హస్తాలు రక్తసిక్తమైనవే అని, వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంగా ఈ దాడి చేశారని అన్నారు. ఈ హత్య రాజకీయాలను ఖండిస్తూ తిరుపతిలో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల గుండెల్లో కొలువైన మహా నాయకుడు వైఎస్‌ జగన్‌కు ఏదైన ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలంతా భయపడుతున్నారని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కిందట చంద్రబాబు పై అలిపిరిలో దాడి జరిగితే.. కనీసం తెలుగుదేశం వాళ్లు కూడా నిరసన చేయలేదన్నారు. దివంగత వైఎస్సార్‌, తాను మాత్రమే అప్పట్లో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు
1/5

శ్రీకాళహస్తిలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు

సత్యవేడు :  ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్‌ తదితరులు
2/5

సత్యవేడు : ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్‌ తదితరులు

సీఎం వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండిస్తున్న గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ
3/5

సీఎం వైఎస్‌ జగన్‌పై దాడిని ఖండిస్తున్న గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ

నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
4/5

నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

5/5

Advertisement
 
Advertisement
 
Advertisement