TS RTC MD Sajjanar Twitter Account Hacked, Details Inside - Sakshi
Sakshi News home page

Sajjanar Twitter Hacked: టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

Published Mon, Jan 23 2023 5:34 PM

TS RTC MD Sajjanar Twitter Account Hacked - Sakshi

హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్‌ ఆర్టీసీ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురి కావడం చాలా దురదృష్టకర సంఘటనగా టీఎస్‌ ఆర్టీసీ పేర్కొంది.

ప్రస్తుతం సదరు అకౌంట్‌ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇ‍వ్వడం కానీ జరగడం లేదని టీఎస్‌ ఆర్టీసీ పీఆర్‌వో పేర్కొన్నారు. ట్విట్టర్‌ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్‌ సపోర్ట్‌ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement