తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌ | Telangana Government Increased Anganwadi Worker Salaries | Sakshi
Sakshi News home page

తెలంగాణ: అంగన్‌వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్‌, భారీగా జీతాల పెంపు

Published Wed, Aug 18 2021 9:00 PM | Last Updated on Wed, Aug 18 2021 9:17 PM

Telangana Government Increased Anganwadi Worker Salaries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
(చదవండి: కోర్టు తీర్పును టైప్‌ చేస్తున్న స్టెనోగ్రాఫర్‌.. అంతలోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement