Sankranthi Special: TSRTC Lahari Sleeper Buses to AP - Sakshi
Sakshi News home page

TSRTC: ఏపీకి స్పెషల్‌ స్లీపర్‌ బస్సులు.. ఛార్జీలు ఎంతంటే?

Published Thu, Jan 5 2023 1:48 PM | Last Updated on Thu, Jan 5 2023 3:00 PM

Sleeper Special Buses From TSRTC To AP For Sankranti Festival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ సంబురాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్‌ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం స్పెషల్‌ ప్లాన్స్‌ రెడీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరవాసులు సిటీ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ సైతం రెడీ అయ్యింది. ఈ ఏడాది పండుగ కోసం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను సిద్ధం చేసింది. పండుగకు ముందే స్లీపర్‌ బస్సులను టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించనుంది. ప్రయాణికులను ఆకర్షించే విధంగా లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను సిద్ధం చేసింది. సంక్రాంతికి 10 లహరి స్లీపర్‌ బస్సులను హైదరాబాద్‌ నుండి కాకినాడ, విజయవాడకు నడుపనుంది.

ఇక, ఈ బస్సుల్లో మాములు ఆర్టీసీ బస్సుల్లో ఉన్న విధంగానే సాధారణ ఛార్జీలే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను మేకింగ్‌ చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement