సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ వేముల తల్లి Rohit Vemula Mother Meets Cm Revanth On Her Son Case Enquery | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్‌ వేముల తల్లి

Published Sat, May 4 2024 12:09 PM | Last Updated on Sat, May 4 2024 1:20 PM

Rohit Vemula Mother Meets Cm Revanth On Her Son Case Enquery

సాక్షి, హైదరాబాద్‌: రోహిత్ వేముల తల్లి రాధిక వేముల శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొడుకు ఆత్మహత్య కేసులో తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన రేవంత్‌.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కాగా సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని పేర్కొన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.

మరుసటి రోజే రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. విచారణ, దర్యాప్తు విధానంపై రోహిత్‌ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని, దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారుజతదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని డీజీపీ  పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement