ఈ గాలి.. ఈ నేలా.. Reverse migration from abroad | Sakshi
Sakshi News home page

ఈ గాలి.. ఈ నేలా..

Published Wed, Jun 26 2024 6:48 AM | Last Updated on Wed, Jun 26 2024 9:59 AM

Reverse migration from abroad

    సిటీకి తిరిగి వచ్చేస్తున్న వృత్తి నిపుణులు 

    ఇతర నగరాలకు చెందిన వారు సైతం...ఇక్కడకే.. 

    విదేశాల నుంచి రివర్స్‌ మైగ్రేషన్‌...  

‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ..’ అంటూ బంగారు భవిష్యత్తును ఊహించుకుంటూ విదేశాలకు వెళ్లిన వృత్తి నిపుణులు రూట్‌ మార్చారు. ‘ఈ గాలి..ఈ నేలా అని పాడుకుంటూ తిరిగి నగరానికి వచ్చేస్తున్నారు. అలా వచ్చేస్తున్న మన దేశీయుల్లో సిటీకి చెందిన వారితో పాటు ఇతర నగరాలకు చెందిన వారు కూడా ఉండడం విశేషం. ఈ అనూహ్యమైన పోకడని వెల్లడించింది ఇంటర్నేషనల్‌ మొబిలిటీ ట్రెండ్స్‌.. నివేదిక. 

విదేశీ ఉద్యోగాల్లో ఇమడలేకపోతున్న యువ నిపుణులు పని వెతుక్కుంటూ నగరానికి తిరిగి వచ్చేస్తున్నారు. ఈ రివర్స్‌ మైగ్రేషన్‌ అమెరికా, యు.కె, కెనడా వంటి దేశాల నుంచి బాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌ మొబిలిటీ ట్రెండ్స్‌పై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ వెలువరించిన తాజా నివేదిక ఈ విశేషాలను వెల్లడించింది. విదేశాల్లో ఉంటూ అక్కడ పని చేయడానికి ఇష్టపడే భారతీయుల సంఖ్య 2020లో 78 శాతం కాగా అది మూడేళ్లు తిరిగేసరికి 2023 కల్లా.. 54 శాతానికి పడిపోయిందని పేర్కొంది. విదేశాల్లో  చేస్తున్న పనిపట్ల అయిష్టతతో భారత్‌కు వలసలు పెరిగాయని, ఇలా తిరిగొస్తున్న వారిలో అత్యధికులు ఎంచుకుంటున్న టాప్‌ 3 నగరాలుగా వరుసగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయని తేలి్చంది. 

కారణాలెన్నో... 
ఇలా విదేశీ ఉద్యోగాలపై మోజు తగ్గిపోతుండడానికి ‘ఆర్థిక, వృత్తి పరమైన కారణాలతో పాటు అనేక అంశాలు‘ కీలకంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ‘ప్రధానంగా ఆరి్థక అంశాలతో పాటు వృత్తి పరమైన వృద్ధి అవకాశాల కోసం మాత్రమే ఇలా వలస వెళ్లాలని భావిస్తారు. ఆ విధంగా చూస్తే ఇలా తిరిగి వస్తున్నవారిలో ఉద్యోగ అవకాశాల నాణ్యత కోసం  52 శాతం మంది, ఆదాయం, జీవన వ్యయం కోసం, 37 శాతం ఆవిష్కరణ డిజిటలైజేషన్‌ కోసం 29 శాతం మంది విదేశాలను వదలాలని నిర్ణయించుకుంటున్నారు. కుటుంబ అనుకూల వాతావరణం, భద్రత, జీవన నాణ్యత కూడా ప్రధాన కారకాలు‘ అని నివేదిక వెల్లడించింది.  

మన నగరానికే ఎందుకంటే... 
ఇలా విదేశాల నుంచి మన దేశానికి తిరిగి వస్తున్నవారిలో అత్యధికులు నగరాన్ని ఎంచుకోవడానికి నగరంలో ఐటీ రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి  చెందడం, జీవన వ్యయం తక్కువగా ఉండడం, నగరం సురక్షితం అనే  ఇమేజ్‌... వంటివి కారణాలుగా ఇటీవల నగరానికి మకాం మార్చిన వారు చెబుతున్నారు. ‘కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేశాను కాబట్టి అమెరికాలో మంచి ఉద్యోగం వస్తుందని ఆశించాను. కానీ నేను ఆశించింది జరగలేదు. పైగా నా మీద ఆధారపడి నా భార్య నాతో వచ్చేసింది, జీవితం గడపడానికి  నేను ఒక కనీ్వనియన్స్‌ స్టోర్‌లో ఉద్యోగం చేయాల్సి వచి్చంది. ఇలా లాభం లేదని నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చాను’ అని ఎస్‌.సుదర్శన్‌ రావు చెప్పారు. 

అతను వెళ్లే ముందు నగరంలో తనకి ఆరంకెల జీతంతో ఉద్యోగం ఇచి్చన అదే కంపెనీ..తిరిగి వచ్చిన తర్వాత కూడా అతనికి మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని అందించింది ‘ కేవలం ఐటీ రంగంలోనే కాదు, ఫైనాన్స్, ఫార్మా తదితర  రంగాలలో కూడా నగరంలో మంచి అవకాశాలు ఉన్నాయి‘ అని మరో ఉద్యోగి చరణ్‌ అంటున్నారు. మహారాష్ట్రలోని అకోలాకు చెందిన ఖైతాన్‌ ఖురేషీ కూడా తన కెనడియన్‌ కలలను వదులుకుని నగరానికి వచ్చేశారు. ‘కెనడాలో నా నెలవారీ ఖర్చులు అక్కడ నేను సంపాదించగలిగిన దానికంటే చాలా ఎక్కువ. పైగా నేను ఎడ్యుకేషన్‌ లోన్‌ కూడా చెల్లించాల్సి ఉంది. వచ్చే నెల బడ్జెట్‌కు కేటాయింపుల కంటే ఇండియాకు టిక్కెట్‌ కొనడమే చౌక అని అనుకున్నా’ అంటూ ఆయన నవ్వుతూ చెప్పారు.  

మాట సాయం కీలకమే... 
విదేశాల్లో మనవారికి కొరవడుతున్న ఎమోషనల్‌ సపోర్ట్‌ కూడా కీలకమని వీరు అంటున్నారు. తమ రివర్స్‌ మైగ్రేషన్‌కు  భావోద్వేగ మద్దతు లభించకపోవడం కూడా కొందరు కారణాలుగా పేర్కొన్నారు. ‘బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ తర్వాత అమెరికాలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించడం నా అదృష్టంగా భావించాను. అయితే మాట్లాడటానికి ఎవరూ లేకపోవడం, ఇంటి పనులతో పాటు తీవ్రమైన పని షెడ్యూల్‌..అది నిర్వర్తించడానికి కనీస అవసరమైన భావోద్వేగ మద్దతు లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది’ అని నగరానికి తిరిగి వచ్చి ఇక్కడ తనవారితో కలిసి ఆనందంగా గడుపుతున్న అద్నాన్‌ అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement