ఈఎస్‌ఐలో కొలువుల భర్తీ Replacement of jobs in ESI | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐలో కొలువుల భర్తీ

Published Fri, Apr 21 2023 4:09 AM | Last Updated on Fri, Apr 21 2023 4:09 AM

Replacement of jobs in ESI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య కొలువుల భర్తీకి ఈఎస్‌ఐసీ ఉపక్రమించింది. వివిధ కేటగిరీల్లో ఉన్న పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డాక్టర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. నాలుగు కేటగిరీల్లో 40 పోస్టులు భర్తీ కానున్నాయి. సీనియర్‌ రెసిడెంట్‌ కేటగిరీలో 29 ఖాళీలు, సూపర్‌ స్పెషలిస్ట్‌ (సీనియర్‌ లెవల్‌)/ సీనియర్‌ కన్సల్టెంట్‌ కేటగిరీలో 5 ఖాళీలు, సూపర్‌ స్పెషలిస్ట్‌ (ఎంట్రీలెవల్‌)/జూనియర్‌ కన్సల్టెంట్‌ కేటగిరీలో 3 ఖాళీలు, స్పెషలిస్ట్‌ కేటగిరీలో 3 ఖాళీలున్నాయి.

రోస్టర్, రిజర్వేషన్‌ వారీగా పోస్టులను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఈ కొలువుల భర్తీ పూర్తిగా మెరిట్, ఇంటర్వ్యూల పద్ధతిలో జరుగుతుంది. సూపర్‌ స్పెషలిస్ట్‌ (సీనియర్‌ లెవల్‌/ఎంట్రీలెవల్‌) గరిష్ట వయోపరిమితి 69 సంవత్సరాలుగా ఖరారు చేయగా.. స్పెషలిస్ట్‌కు 66 సంవత్సరాలు, సీనియర్‌ రెసిడెంట్‌కు 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితిని నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని పూరించాలి. నిర్దేశించిన డాక్యుమెంట్లతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ప్రాధాన్యత ఇస్తారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అర్హత సాధించిన వైద్యులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది. 



పోస్టుల వారీగా వేతనాలు 

సూపర్‌ స్పెషలిస్ట్‌ (సీనియర్‌ లెవల్‌) /  సీనియర్‌ కన్సల్టెంట్‌ రూ.2,40,000/– (కన్సాలిడేట్‌ రెమ్యునరేషన్‌)

సూపర్‌ స్పెషలిస్ట్‌ (ఎంట్రీలెవల్‌) /  జూనియర్‌ కన్సల్టెంట్‌ రూ.2,00,000/– (కన్సాలిడేట్‌ రెమ్యునరేషన్‌) 

స్పెషలిస్ట్‌ రూ.1,27,141/– (కన్సాలిడేట్‌ రెమ్యునరేషన్‌) 

సీనియర్‌ రెసిడెంట్‌ రూ.67,000/– + డీఏ, ఎన్‌పీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement