రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు Rajaiah Takes Charge as Rythu Bandhu Samiti Chief | Sakshi
Sakshi News home page

రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు

Published Tue, Oct 10 2023 5:47 AM | Last Updated on Tue, Oct 10 2023 12:50 PM

Rajaiah Takes Charge as Rythu Bandhu Samiti Chief - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతు­బంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అన్నారు.

ఈ సమి­తిలో 1.60 లక్షల మంది సభ్యు­లున్నారని, సీఎం కేసీఆర్‌ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవ­సాయ రంగానికి తె­లంగాణ ప్రభు­త్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్న­మైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement