కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించండి: కౌశిక్‌ రెడ్డి భార్య | Padi Kaushik Reddy Fell On Fire On Etela Rajender Ahead Of Telangana Assembly Elections 2023, See Details - Sakshi
Sakshi News home page

కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించండి: కౌశిక్‌ రెడ్డి భార్య

Published Wed, Nov 29 2023 11:14 AM | Last Updated on Wed, Nov 29 2023 2:53 PM

Padi Kaushik Reddy Fell On Fire On Etela Rajender - Sakshi

ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్‌: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్‌ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేసిండు. ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా’ అని బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. కమలాపూర్‌ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. ఇక్కడి ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా పని చేసి కూడా సొంత మండలం, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 

ఉపఎన్నికల్లో గెలిచి ఒక్కసారి మండలానికి రాలేదని, మంత్రిగా ఉండి మహిళా సంఘం భవనం కట్టించలేదని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోవద్దన్నారు. ‘మీ దయ, దండం పెట్టి, గదవ పట్టుకొని, మీ కడుపులో తలపెట్టి మరీ అడుగుతున్న నన్ను గెలిపించండి.. చేసిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తా’నని అన్నారు. వేరేవారు గెలిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది, తనను గెలిపిస్తే కమలాపూర్‌ను దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. మీ ఆడబిడ్డగా కొంగుచాచి భిక్ష అడుగుతున్నా.. నా భర్తను గెలిపించాలని కౌశిక్‌రెడ్డి భార్య షాలిని కోరారు. 

మా డాడీని భారీ మెజార్టీతో గెలిపించాలని కూతురు శ్రీనిక ఓటర్లను వేడుకున్నారు. అనంతరం కార్యకర్తలు, మహిళలతో కలిసి కౌశిక్‌రెడ్డి డ్యాన్స్‌ చేశారు. కౌశిక్‌రెడ్డికి మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ రాణిశ్రీకాంత్, జెడ్పీటీసీ కల్యాణిలక్ష్మణ్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంపత్‌రావు, వైస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్‌ సత్యనారాయణరావు, వైస్‌ ఎంపీపీ శైలజఅశోక్, సర్పంచ్‌ విజయతిరుపతిరెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశ్వర్లు, రాధికారమే‹శ్, నాయకులు పాల్గొన్నారు. 

భారీ మెజార్టీతో గెలిపించాలి
ఇల్లందకుంట మండలంబూజునూర్‌ గ్రామంలో ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే పాడి కౌశిక్‌రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.  జమ్మికుంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రామస్వామి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌  కొమురెల్లి, ఎంపీటీసీ విజయ–కుమార్, గ్రామశాఖ అధ్యక్షుడు విక్రమ్, మాజీ ఎంపీటీసీ రామ్‌ స్వరణ్‌రెడ్డి, నాయకులు,తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయం
వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి, బేతిగల్, కనపర్తి, ఘన్ముక్కుల గ్రామాలలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం నిర్వహించారు. హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.   

గడపగడపకు ప్రచారం
జమ్మికుంట పట్టణంలో పాడి కౌశిక్‌రెడ్డికి మద్దతుగా మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, పట్టణ ఆర్యవైశ్యుల సంఘం అ«ధ్యక్షుడు ఐత మహేశ్‌ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ఒక్కసారి పాడి కౌశిక్‌రెడ్డికి అవకాశం కల్పించాలని కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement