డ్రైవర్‌నూ వదలని శివబాలకృష్ణ! HMDA Shiva Balakrishna Corruption Case: Driver Attender Arrested | Sakshi
Sakshi News home page

ఆఖరికి డ్రైవర్‌, అటెండర్‌ పేరిట శివబాలకృష్ణ భారీగా అక్రమాస్తులు!!

Published Wed, Feb 14 2024 1:41 PM | Last Updated on Wed, Feb 14 2024 1:49 PM

HMDA Shiva Balakrishna Corruption Case: Driver Attender Arrested - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన.  తాజాగా.. ఆయన దగ్గర అటెండర్‌, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్‌ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. 

శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్‌, డ్రైవర్‌ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్‌ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్‌ గోపీకి కాస్ట్‌లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ చేశారు. భరత్‌, భరణి, ప్రమోద్‌ కుమార్‌లతో పాటు సోదరుడు శివ నవీన్‌కుమార్‌, స్నేహితుడు సత్యనారాయణలను ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. శివ బాలకృష్ణ దగ్గర పీఏగా పని చేసిన భరణి.. కంప్యూటర్‌ ఆపరేటర్‌గానూ పని చేశాడు. అదే సమయంలో ఎన్విస్‌ డిజైన్‌ స్టూడియో పేరుతో.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, లే అవుట్‌ బిల్డింగ్‌లకు అనుమతులు మంజూరు చేశాడు. మరో బినామీ అయిన ప్రమోద్‌కు మీనాక్షి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు స్నేహితుడు సత్యనారాయణను సైతం ఏసీబీ విచారిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement