కవితపై ఈడీ ఛార్జ్‌షీట్‌.. 29న కోర్టు కీలక తీర్పు | Ed Files Chargesheet On Kavitha In Liquor Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కవితపై ఈడీ ఛార్జ్‌షీట్‌.. 29న కోర్టు కీలక తీర్పు

Published Tue, May 21 2024 4:01 PM | Last Updated on Tue, May 21 2024 4:42 PM

Ed Files Chargesheet On Kavitha In Liquor Scam

సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే  అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్‌ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. 

ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో  ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జ్‌షీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్‌ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. 

అభిషేక్ బోయినపల్లి ఇంటరాగేషన్‌లో కూడా వీరి పాత్ర ఉందని తేలింది. ముత్తా గౌతమ్ స్టేట్‌మెంట్‌ కూడా వీరి పాత్రను బయటపెట్టింది. హవాలా సొమ్ము రవాణాలో చారియట్‌ మీడియా ఉద్యోగి దామోదరశర్మ పాత్ర కూడా ఉంది. వాట్సాప్ చాట్ మెసేజ్ ద్వారా వీరి పాత్రపై సాక్ష్యాలు లభించాయి

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement