వీఆర్‌ఏల సర్దుబాటు షురూ  | CCLA Naveen Mittal issued internal orders | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల సర్దుబాటు షురూ 

Published Thu, Aug 10 2023 3:49 AM | Last Updated on Thu, Aug 10 2023 3:49 AM

CCLA Naveen Mittal issued internal orders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకుల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. పలు ప్రభుత్వశాఖల్లో వారిని విలీనం చేసేందుకు వీలుగా 14,954 సూపర్‌ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యా­యి. రెవెన్యూతోపాటు మిషన్‌ భగీరథలో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌మిత్తల్‌ బుధవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఏ పోస్టులో ఎంతమందిని నియమించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

రెవెన్యూ శాఖలో ఇలా... 
రెవెన్యూశాఖ పరిధిలో జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో 16, డివిజన్‌లో 7, మండల స్థాయిలో ఐదుగురిని నియమించాలని,  రికార్డు అసిస్టెంట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో ముగ్గురు, డివిజన్‌లో నలుగురు, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని వెల్లడించారు. ఇక, ఆఫీస్‌ సబార్డినేట్‌ కేటగిరీలో జిల్లాస్థాయిలో 12 మంది, డివిజన్‌లో నలుగురిని, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని, చైన్‌మెన్లుగా డివిజన్, మండల స్థాయిలో ఒక్కరు చొప్పున నియమించుకోవాలని సూచించారు.  

మిషన్‌ భగీరథలో... 
మిషన్‌ భగీరథకు సంబంధించి ప్రతి రూరల్‌ మండ­లంలో ఆరుగురుని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సూచించారు.  మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, సాగునీటిశాఖలో లస్కర్లుగా ఎంత మంది వీఆర్‌ఏలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై ఆయా శాఖలు త్వరలోనే స్పష్టత ఇస్తాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement