బాహుబలి బఫెట్‌ Baahubali Buffet In Gachibowli | Sakshi
Sakshi News home page

బాహుబలి బఫెట్‌

Published Mon, Jun 17 2024 7:33 AM

Baahubali Buffet In Gachibowli

గచ్చిబౌలి: భారతదేశంలోనే అతిపెద్ద ఫ్యామిలీ ‘బఫెట్‌’ రెస్టారెంట్‌ గచ్చిబౌలిలో అందుబాటులోకి వచి్చంది. మాస్టర్‌ పీస్‌ ఇండియా ఆధ్వర్యంలో దీన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే...300 రకాల విభిన్న వంటకాలు అందుబాటులో ఉండడం.  500 మంది కూర్చునే సామర్థ్యంతో సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ రెస్టారెంట్‌లో భారతీయ వంటకాలతోపాటు పాశ్చాత్య దేశాల రుచులను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు.

 హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీతోపాటు కరేబియన్‌ ఫుడ్డింగ్, రాజస్థానీ కోఫ్తా కర్రీ, థాయ్‌ రెడ్‌కర్రీ, జపనీస్‌ సకానా కుట్సు, డచ్‌ చికెన్‌తో పాటు అనేక రకాల వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వెరైటీ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇతర అన్ని రుచులు కలిపి 300 రకాల వంటకాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. టేస్ట్‌కు టేస్ట్‌.. ఎన్నో వెరైటీలు అందుబాటులోకి రావడంతో ఫుడ్‌లవర్స్‌ ఖుషీ అవుతున్నారు. మరెందుకు ఆలస్యం.. మాస్టర్‌ పీస్‌ వైపు ఓ లుక్కేయండి మరి.  

Advertisement
 
Advertisement
 
Advertisement