6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్‌ | Vamshhi Krrishna emulates Yuvraj Singh, hits 6 sixes in an over | Sakshi
Sakshi News home page

6 బంతుల్లో 6 సిక్స్‌లు.. యువీని గుర్తు చేశాడుగా! వీడియో వైరల్‌

Published Thu, Feb 22 2024 10:38 AM | Last Updated on Thu, Feb 22 2024 11:17 AM

Vamshhi Krrishna emulates Yuvraj Singh, hits 6 sixes in an over  - Sakshi

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ జాతీయ అండర్ -23 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర ఓపెనర్‌ మామిడి వంశీ కృష్ణ 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా రైల్వేస్ జట్టుతో ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో వంశీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన 10వ ఓవర్‌లో వరుసగా 6 సిక్స్‌లు బాది వంశీ రికార్డులకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న వంశీ కృష్ణ 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

మూడో బ్యాటర్‌గా..
కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కృష్ణ నిలిచాడు. అతడి కంటే ముందు రవి శాస్త్రి, రుతురాజ్ గైక్వాడ్ భారత్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం భారత తరపున దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ ఒక్కడే 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదాడు. టీ20 వరల్డ్‌కప్‌-2007లో ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ వరుసగా 6 సిక్స్‌లు బాదాడు.

మ్యాచ్‌ డ్రా..
ఇక ఆంధ్ర-రైల్వేస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్‌ డ్రా అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రైల్వేస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. యాన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలతో చెలరేగారు.

రైల్వేస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడంతో మ్యాచ్ చివరిలో డ్రాగా ముగుస్తుంది. అన్ష్ యాదవ్ (268), రవి సింగ్ (258) డబుల్ సెంచరీలు, అంచిత్ యాదవ్ (133) సెంచరీలతో రైల్వేస్ తొలి ఇన్నింగ్స్‌లో 865 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement