Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్‌ Taipei Open: Indias campaign ends after 3 quarterfinal losses | Sakshi
Sakshi News home page

Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్‌

Published Sat, Jul 23 2022 3:08 AM | Last Updated on Sat, Jul 23 2022 3:08 AM

Taipei Open: Indias campaign ends after 3 quarterfinal losses - Sakshi

తైపీ ఓపెన్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 40వ ర్యాంకర్‌ కశ్యప్‌ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్‌ సూంగ్‌ జూ వెన్‌ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు.

కశ్యప్‌నకు 3 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–ఇషాన్‌ (భారత్‌) జంట 19–21, 12–21తో హూ పాంగ్‌ రోన్‌–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్‌) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్‌ యా– సాంగ్‌ హి యాన్‌ (హాంకాంగ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement