BBL 2021-22: Sydney Sixers Enters BBL Final But High Drama Found Last-Ball Viral - Sakshi
Sakshi News home page

BBL 2021-22: మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?!

Published Thu, Jan 27 2022 10:10 AM | Last Updated on Fri, Jan 28 2022 10:06 AM

Sydney Sixers Enters BBL Final But High Drama Found Last-Ball Viral - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ సిక్సర్‌ మధ్య జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ చివర్లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే..  సిడ్నీ సిక్సర్స్‌ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హెడెన్‌ కెర్‌ 94 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. స్ట్రైకింగ్‌లోనూ అతనే ఉండడంతో సిడ్నీ సిక్సర్స్‌ ఈజీగానే విజయం సాధిస్తుందనుకున్నాం. అయితే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న జోర్డాన్‌ సిల్క్‌ గాయపడ్డాడు. ఆఖరి బంతి తర్వాత ఎలాగో పెవిలియన్‌ చేరాల్సి ఉంటుంది. అయితే ఆఖరి బంతికి మందు గాయపడిన సిల్క్‌ను రిటైర్డ్‌హర్ట్‌గా వెనక్కిపిలిచి అతని స్థానంలో జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పిలిచారు.

చదవండి: Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్‌ బ్యాటర్‌ విధ్వంసం

క్రికెట్‌ పుస్తకాల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్‌ ఆట చివర్లో గాయపడితే రిటైర్డ్‌హర్ట్‌గా అతని స్థానంలో కొత​ బ్యాట్స్‌మన్‌ను తీసుకోవచ్చు.  కానీ సిక్సర్స్‌ ఆ రూల్‌ను ఫాలో అయ్యే లెంటన్‌ను తీసుకొచ్చింది. అయితే గెలిచే సమయానికి ఇలాంటి నిర్ణయం ఎందుకన్నది ఎవరికి అంతుచిక్కలేదు. పైగా ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి సెంచరీతో హెడెన్‌ కేర్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. ''మ్యాచ్‌ ఎలాగో గెలిచారు.. మరి ఆఖర్లో ఈ డ్రామాలేంటి'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వెల్స్‌ 62 నాటౌట్‌, ఇయాన్‌ కాక్‌బ్రెయిన్‌ 48, రెన్‌ షా 36 నాటౌట్‌ రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ సిక్సర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌.. పెర్త్‌ స్కార్చర్స్‌తో తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement