Ashes 5th Test Day 2: Steven Smith Survives Runout Dismissal After Controversial Decision, Video Viral - Sakshi
Sakshi News home page

Ashes 2023 Steve Smith Run Out Video: ఔటని వెళ్లిపోయిన స్మిత్‌.. ఇంగ్లండ్ కొంపముంచిన బెయిర్ స్టో తప్పిదం! వీడియో వైరల్‌

Published Sat, Jul 29 2023 8:18 AM | Last Updated on Sat, Jul 29 2023 9:48 AM

Steven Smith survives runout dismissal after controversial decision - Sakshi

యాషెస్‌ సిరీస్ 2023లో మరో వివాదం తలెత్తింది. లండన్‌ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ చాకచాక్యంగా వ్యవహరించడంతో.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తృటిలో రనౌటయ్యే అవకాశాన్ని తప్పించుకున్నాడు. 

అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 78 ఓవర్‌ వేసిన క్రిస్ వోక్స్  బౌలింగ్‌లో మూడో బంతికి  స్మిత్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. దీంతో స్మిత్‌ సింగిల్‌ పూర్తి చేసుకుని రెండో రన్‌ కోసం వికెట్‌ కీపర్‌ ఎండ్‌కు పరిగెత్తాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్‌హామ్ మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వైపు త్రోచేశాడు. బంతిని అందుకున్న బెయిర్‌ స్టో వెంటనే బెయిల్స్‌ పడగొట్టాడు.

స్మిత్‌ కూడా తన వికెట్‌ను కాపాడుకోవడానికి అద్భుతంగా డైవ్‌ చేశాడు. అయితే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఔట్‌ అని సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫీల్డ్‌ అంపైర్‌ విల్సన్‌ థర్డ్‌ అంపైర్‌కు రీఫర్‌ చేశాడు.  అయితే తొలుత రీప్లేలో బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. స్మిత్‌ కూడా తను ఔటని భావించి పెవిలియన్‌ వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చేటు చేసుకుంది.  

థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం పలుకోణాల్లో చాలాసేపు పరిశీలించి.. బెయిర్‌ స్టో బంతిని అందుకోక ముందే తన  గ్లోవ్‌తో ఒక బెయిల్‌ను పడగొట్టినట్లు తేల్చాడు. అయితే మరో రెండు బెయిల్స్‌ కింద పడినప్పటికీ స్మిత్‌ క్రీజులోకి వచ్చేశాడు. దీంతో నితిన్‌ మీనన్‌ తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అది చూసిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంగ్లండ్‌ అభిమానులు మాత్రం అది ఔటే అని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌ 75 పరుగులతో రాణించాడు.
చదవండిZim Afro T10: యూసుఫ్ పఠాన్ ఊచకోత.. కేవలం 26 బంతుల్లోనే! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement