ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే? | Sri Lanka announces 15-member cricket squad for Asian Games 2023 | Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే?

Published Tue, Sep 19 2023 11:56 AM | Last Updated on Tue, Sep 19 2023 12:07 PM

Sri Lanka announces 15 member cricket squad for Asian Games - Sakshi

చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌  సహన్ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్‌ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు.

అంతేకాకుండా ఆసియాకప్‌-2023 ఫైనల్‌ శ్రీలంక  జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గోనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో,అషెన్ బండార వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ టోర్నీలో పాల్గోనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్‌ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 23 నుంచి ఆక్టోబర్‌ 8వరకు జరగనుంది.

శ్రీలంక జట్టు: లసిత్ క్రూస్‌పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్‌), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార ​​(వికెట్‌ కీపర్‌), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి,
చదవండి: Asia Cup 2023: పాక్‌ క్రికెట్‌లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్‌ కెప్టెన్‌పై వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement