#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వ‌చ్చాడా.. ? క‌నీసం ఒక్క ఛాన్స్ కూడా | SRHs Aiden Markram Another Failure IPL 2024, Delivers A Bizarre No Ball In RR Vs SRH Match | Sakshi
Sakshi News home page

#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వ‌చ్చాడా.. ? క‌నీసం ఒక్క ఛాన్స్ కూడా

Published Fri, May 24 2024 8:53 PM | Last Updated on Sat, May 25 2024 11:42 AM

SRHs Aiden markram another failure ipl 2024

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆట‌గాడు  ఐడైన్ మార్‌క్రమ్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో క్వాలిఫ‌య‌ర్‌-2 మ్యాచ్‌లో మార్‌క్ర‌మ్ తీవ్రనిరాశ ప‌రిచాడు. గ‌త కొన్ని మ్యాచ్‌ల నుంచి తుది జ‌ట్టుకు దూరంగా ఉంటున్న మార్‌క్ర‌మ్‌కు ఈ మ్యాచ్‌లో అనుహ్యంగా చోటుద‌క్కింది.

అయితే మెనెజ్‌మెంట్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని మార్‌క్ర‌మ్ వమ్ము చేశాడు. కీల‌క స‌మ‌యంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన మార్‌క్ర‌మ్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో చాహ‌ల్‌కు క్యాచ్ ఇచ్చి మార్‌క్ర‌మ్ పెవిలియ‌న్‌కు చేరాడు. 

ఈ క్ర‌మంలో మార్‌క్ర‌మ్‌తో పాటు జ‌ట్టు మెనెజ్‌మెంట్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. వ‌రుస‌గా విఫ‌ల‌మైన ఆట‌గాడికి కీల‌క మ్యాచ్‌లో ఎందుకు ఛాన్స్ ఇచ్చార‌ని మండిప‌డుతున్నారు. అత‌డికి బ‌దులుగా కివీస్ సూప‌ర్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ ఇవ్వ‌ల్సిందని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

మ‌రికొంత మంది అయితే ఫిలిప్స్ ఏమైనా టూర్‌కు వ‌చ్చాడా అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఈ ఏడాది సీజ‌న్‌లో ఫిలిప్స్‌కు క‌నీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవ‌కాశం ఎస్ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్ ఇవ్వ‌లేదు. దీంతో ఎక్స్‌లో #గ్లెన్ ఫిలిప్స్ అనే కీవ‌ర్డ్ ట్రెండ్ అవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement