Shahid Afridi On Harmanpreet Kaur Over Her Controversy Look, Says She Reacts Much Over - Sakshi
Sakshi News home page

Shahid Afridi On Harmanpreet Controversy: 'హర్మన్‌ప్రీత్‌ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది'

Published Wed, Jul 26 2023 1:42 PM | Last Updated on Wed, Jul 26 2023 2:43 PM

Shahid Afridi On Harmanpreet Kaur Controversy Look-She Reacts Much-Over - Sakshi

టీమిండియా మహిళల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై విమర్శల వేడి తగ్గడం లేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అంపైర్‌పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్‌ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు హర్మన్‌ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. కాగా హర్మన్‌ తీరుపై పాకిస్తాన్‌ మాజీ  క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్‌ విషయంలో హర్మన్‌ చేసింది ఓవర్‌గా అనిపించిందని.. అంత వైల్డ్‌గా రియాక్ట్‌ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. 

"భారత్‌ విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్‌లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్‌కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్‌ప్రీత్‌ విషయంలో ఓవర్‌ అనిపించింది. ఔట్‌ విషయంలో అంత వైల్డ్‌గా రియాక్ట్‌ అవ్వాల్సిన పని లేదు." అని అఫ్రిది స్పష్టం చేశాడు.

కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 

గత శనివారం మిర్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్‌ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్‌ దురుసుగా వ్యవహరించింది. ముందుగా తనను అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి పడేయడంతో పాటు వెళుతూ వెళుతూ అంపైర్‌ను చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేసింది. దీనిపై మూడు డీమెరిట్‌ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్‌ ముగిసిన తర్వాతా అంపైరింగ్‌ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్‌ పాయింట్‌ శిక్ష పడింది.

అనంతరం వేదికపై బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నిగార్‌ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్‌ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్‌ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. దీనిపై సుల్తానా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాస్త మర్యాద నేర్చుకోమంటూ సహచరులతో కలిసి వేదిక నుంచి దిగేసింది. 4 డీమెరిట్‌ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్‌ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్‌ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్‌–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్‌ హర్మన్‌ కావడం గమనార్హం. 

చదవండి: టీమిండియా కెప్టెన్‌ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు

Asian Games 2023: హర్మన్‌పై వేటు.. ఆసియా గేమ్స్‌లో జట్టును నడిపించేది ఎవరు?

#HarmanpreetKaur: 'డేర్‌ అండ్‌ డాషింగ్‌' హర్మన్‌ప్రీత్‌.. కుండ బద్దలయ్యేలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement