సూపర్‌ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌ | Shadab Khans screamer stuns Babar Azam in PSL 2024 | Sakshi
Sakshi News home page

PSL 2024: సూపర్‌ మ్యాన్‌లా.. గాల్లోకి ఎగురుతూ? బాబర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published Sun, Mar 17 2024 10:24 AM | Last Updated on Sun, Mar 17 2024 10:52 AM

Shadab Khans screamer stuns Babar Azam in PSL 2024 - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024 లీగ్‌ ఫైనల్లో ఇస్లామాబాద్ యునైటెడ్‌ అడుగుపెట్టింది. శనివారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.  అయితే ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో పెషావర్ జల్మీ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను పెవిలియన్‌కు పంపాడు.

పెషావర్‌ ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌ వేసిన నసీమ్‌ షా 4వ బంతిని బాబర్‌కు ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. బాబర్‌ కొంచెం రూమ్‌ తీసుకుని మిడ్ ఆఫ్ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్‌ ఆఫ్‌లో ఉన్న షాదాబ్‌ ఖాన్‌.. ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకున్నాడు. ఇది చూసిన బాబర్‌ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement