GT Vs MI, IPL 2023: Sachin Daughter Sara Tendulkar Trending On Twitter | Shubman Gill Vs Arjun Tendulkar - Sakshi
Sakshi News home page

#SaraTendulkar: ముంబై , గుజరాత్‌ మ్యాచ్‌.. ట్రెండింగ్‌లో సారా టెండూల్కర్‌!

Published Tue, Apr 25 2023 11:15 PM | Last Updated on Wed, Apr 26 2023 11:22 AM

Sachin Daughter Sara Tendulkar Twitter-Trending List-MI Vs GT Match - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో మంగళవారం ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లో నిలిచింది. ఇలా ఎందుకున్నది ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి.

గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, సారా టెండూల్కర్‌ల మధ్య ప్రేమాయణం నడుస్తుదంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ గిల్‌ టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించినప్పటి నుంచి సారా, గిల్‌ల మధ్య మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే తాము మంచి స్నేహితులమని గిల్‌ పేర్కొన్నప్పటికి క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం తమకు నచ్చింది ఊహించుకుంటూ బతికేస్తున్నారు.

ఇక మరో విషయం ఏంటంటే.. ముంబై ఇండియన్స్‌ తరపున సారా టెండూల్కర్‌ సోదరుడు అర్జున్‌ మ్యాచ్‌లో బరిలో ఉండడమే. ఒకవైపు గుజరాత్‌ తరపున శుబ్‌మన్‌ గిల్‌.. ముంబై జట్టు తరపున అర్జున్‌ ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో సారా ఎవరికి మద్దతివ్వాలో తెలియక మ్యాచ్‌ చూడడం మానేసిందని కొందరు అభిమానులు ట్విటర్‌లో ఫన్నీ ట్రోల్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌లో అర్జున్‌ టెండూల్కర్‌, శుబ్‌మన్‌ గిల్‌లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. గుజరాత్‌ టైటాన్స్‌ తొలి ఓవర్‌ అర్జున్‌ వేసినప్పటికి ఆ ఓవర్‌లో నాలుగో బంతిని గిల్‌ ఎదుర్కొని ఒక పరుగు చేశాడు.  ఇక తన రెండో ఓవర్‌ తొలి బంతికే సాహాను ఔట్‌ చేసిన అర్జున్‌ బౌలింగ్‌ ఎదుర్కొనే చాన్స్‌ గిల్‌కు రాలేదు. మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన అర్జున్‌ 9 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ శుబ్‌మన్‌ గిల్‌ సీజన్‌లో మూడో అర్థసెంచరీ సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

''ఏది ఏమైనా గుజరాత్‌, ముంబై మ్యాచ్‌లో అటు సోదురుడు అర్జున్‌ టెండూల్కర్‌.. ఇటు గిల్‌ ఇద్దరు మంచి ప్రదర్శన కనబరచడంతో సారా టెండూల్కర్‌కు ఎలాంటి బాధ లేదని.. పైగా ఈ ఇద్దరు ఎదురుపడినా ఎవరు పైచేయి సాధించకపోవడం సారాకు సంతోషం కలిగించి ఉంటుందని'' ఫ్యాన్స్‌ పేర్కొన్నారు.

చదవండి: వికెట్లు తీసేవాడేమో.. తప్పు చేశాడని బౌలింగ్‌ ఇ‍వ్వకుంటే ఎలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement