గోల్డ్‌మెడల్‌ టార్గెట్‌గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా | Ruturaj Gaikwad-led Team India jets off to China for Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games 2023: గోల్డ్‌మెడల్‌ టార్గెట్‌గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా

Published Thu, Sep 28 2023 1:26 PM | Last Updated on Thu, Sep 28 2023 1:35 PM

Ruturaj Gaikwad led Team India jets off to China for Asian Games - Sakshi

ఆసియా క్రీడలు-2023లో పాల్గోనేందుకు రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని భారత జట్టు గురువారం చైనాకు బయలు దేరి వెళ్లింది. ముంబై నుంచి నేరుగా ఏసియన్‌ గేమ్స్‌ జరగుతున్న హంగ్జూకు టీమిండియా పయనమైంది. కాగా క్రీడలకు భారత త్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.

ఈ జట్టుకు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. వీవీయస్‌ లక్ష్మణ్‌కు కోచింగ్‌ బాధ్యతలు అప్పజెప్పింది. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్‌, తిల‌క్ వ‌ర్మ‌, రింకూ సింగ్‌ వంటి యువ సంచలనాలకు చోటు దక్కింది. ఇక ఇప్పటికే ఏషియన్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో భారత జట్టు గోల్డ్‌మెడల్‌ సాధించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు భారత పురుషల జట్టు కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రీడల్లో భార‌త్ ప్రయాణం అక్టోబ‌ర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న‌ది. భారత్‌ నేరుగా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో తలపడనుంది. నేరుగా క్వార్ట‌ర్స్ ఆడుతున్న జ‌ట్ల‌లో.. ఇండియాతో పాటు ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక జ‌ట్లు ఉన్నాయి.

భార‌త జ‌ట్టు : రుతురాజ్ గైక్వాడ్‌(కెప్టెన్‌), ముకేశ్ కుమార్‌, శివం మావి, శివ‌మ్ దూబే, ప్ర‌భుసిమ్ర‌న్ సింగ్‌(వికెట్‌ కీప‌ర్‌), య‌శ‌స్వి జైస్వాల్‌, రాహుల్ త్రిపాఠి, తిల‌క్ వ‌ర్మ‌, రింకూ సింగ్‌, జితేశ్ శ‌ర్మ‌(కీప‌ర్), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, షాబాజ్ అహ్మ‌ద్‌, ర‌వి బిష్ణోయ్‌, అవేశ్ ఖాన్‌, అర్ష‌దీప్‌సింగ్‌.

చదవండి: IND vs AUS: విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్‌ రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement