రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. మెరుపు వేగంతో! వీడియో వైరల్‌ Rohit Sharma's Stunning Slip Catch Helps Jadeja Get Rid Of Ollie Pope | Sakshi
Sakshi News home page

IND vs ENG: రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. మెరుపు వేగంతో! వీడియో వైరల్‌

Published Sun, Feb 18 2024 3:50 PM | Last Updated on Sun, Feb 18 2024 4:20 PM

Rohit Sharmas Stunning Slip Catch Helps Jadeja Get Rid Of Ollie Pope - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన ఫీల్డింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లీష్ బ్యాటర్ ఆలీ పోప్‌ను సంచలన క్యాచ్‌తో హిట్‌మ్యాన్‌ పెవిలియన్‌ను పంపాడు. ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 10 ఓవర్‌ వేసిన జడేజా బౌలంగ్‌లో నాలుగో బంతిని పోప్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని ఫస్ట్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ మెరుపు వేగంతో స్పందిస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఒక్కనిమషం పాటు అలా క్రీజులో ఉండిపోయాడు. చేసేదేమిలేక పోప్‌ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో​ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత విజయానికి ఇంకా 4 వికెట్లు కావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement