Will Pakistan boycott ODI World Cup in India? PCB chief makes BIG statement - Sakshi
Sakshi News home page

Ind Vs Pak: పాక్‌ వన్డే వరల్డ్‌కప్‌ ఆడుతుందా? లేదా? పీసీబీ కొత్త చీఫ్‌ క్లారిటీ

Published Tue, Dec 27 2022 10:14 AM | Last Updated on Tue, Dec 27 2022 10:51 AM

PCB New Chief Big Update On Will Pakistan Boycott ODI WC in India - Sakshi

Asia Cup 2023- India Vs Pakistan- ODI World Cup 2023: పాకిస్తాన్‌ వన్డే వరల్డ్‌కప్‌​-2023 ఆడే అంశంపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొత్త చైర్మన్‌ నజమ్‌ సేతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఈ ఐసీసీ మెగా టోర్నీ కోసం భారత్‌కు వెళ్లే విషయం ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇక ఆసియా కప్‌-2023 నిర్వహణ విషయంలోనూ ఏసీసీతో చర్చలు జరుపుతున్నామన్న సేతీ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.

కాగా ఆసియా కప్‌ ఈవెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైనా విషయం తెలిసిందే. అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా మాత్రం ఆ టోర్నీ కోసం టీమిండియా అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదని వ్యాఖ్యలు చేశారు. తటస్థ వేదికపై ఈవెంట్‌ నిర్వహించే అంశం గురించి గతంలో ప్రస్తావించారు.

జరుగుతుందా? లేదా?
ఇందుకు స్పందించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా.. టీమిండియా తమ దేశానికి రాకపోతే, తాము కూడా వరల్డ్‌కప్‌ ఆడేందుకు అక్కడికి వెళ్లమని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే చిరకాల ప్రత్యర్థుల పోరు చూస్తామో లేదోనంటూ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఇది వరకే స్పష్టం చేశాడు. ఇక ఇంగ్లండ్‌ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ తర్వాత పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నజమ్‌ సేతీ తాజాగా ఈ అంశంపై స్పందించాడు.

ఎలా చెబితే అలా!
కరాచీలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ ఇండియాకు వెళ్లొద్దని మా ప్రభుత్వం చెబితే మేము అలాగే నడుచుకుంటాం. ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాతో ఆడాలా లేదా? అక్కడికి వెళ్లాలా వద్దా? అన్న విషయాల్లో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వం చెప్పినట్లుగానే తాము నడుచుకుంటామని పేర్కొన్నాడు.

చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్‌
Babar Azam: పాంటింగ్‌ రికార్డు బద్దలు కొట్టిన బాబర్‌ ఆజం! సెహ్వాగ్‌లా అలా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement