నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి? | Paul Stirling Gets Hit-On Groin-Obed McCoy Claps Shows Not-Concern | Sakshi
Sakshi News home page

T20 WC 2022: నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?

Published Fri, Oct 21 2022 3:07 PM | Last Updated on Fri, Oct 21 2022 4:17 PM

Paul Stirling Gets Hit-On Groin-Obed McCoy Claps Shows Not-Concern - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన విండీస్‌ ఇలా అవమానకర రీతిలో వెనుదిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరె రెండుసార్లు చాంపియన్‌ అయిన విండీస్‌ ఇలా నాకౌట్‌ కావడం ఏంటని సగటు అభిమాని బాధపడుతున్న వేళ ఆ జట్టు బౌలర్‌ చేసిన కవ్వింపు చర్య ఆగ్రహం తెప్పించింది.

విషయంలోకి వెళితే.. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో అల్జారీ జోసెఫ్‌ ఒక బంతిని స్ట్రెయిట్‌ డెలివరీగా వేశాడు. అయితే పాల్‌ స్టిర్లింగ్‌ మిస్‌ చేయడంతో బంతి అతని గజ్జల్లో బలంగా తాకింది. దీంతో స్టిర్లింగ్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత బాధను ఓర్చుకుంటూనే తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

ఒక బ్యాటర్‌కు తగలరాని చోట తగిలి నొప్పితో బాధపడుతుంటే బౌండరీ లైన్‌ వద్ద ఉన్న విండీస్‌  ఆటగాడు ఒబెద్‌ మెకాయ్‌ మాత్రం చప్పట్లు కొడుతూ ''వెల్‌డన్‌ జోసెఫ్‌ గుడ్‌ బౌలింగ్‌'' అంటూ అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక ‍వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అందరు మెకాయ్‌ చర్యను తప్పుబట్టారు. ''ఒక బ్యాటర్‌ గాయపడి నొప్పితో బాధపడుతుంటే ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని''.. '' ఓడిపోతున్నామని ముందే తెలిసిందా.. అందుకే ఇలా చేశాడా''..'' ఓడిపోయారని సానుభూతి చూపించాలనుకుంటే మెకాయ్‌ చర్యతో అది రివర్స్‌ అయింది.. పాల్‌ స్టిర్లింగ్‌కు ఏం కాకూడదని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో వాస్తవానికి విండీస్‌పై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు.. అయినప్పటికి రెండుసార్లు చాంపియన్‌ కావడంతో కాస్త ఆశలు ఉన్నాయి. కానీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌ అనంతరం వెస్టిండీస్‌కు అంత సీన్‌ లేదన్న విషయం అర్థమయింది. 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలో చేతులెత్తేసిన వెస్టిండీస్‌ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

అటు ఐర్లాండ్‌ మాత్రం 147 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా జట్టు ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ ఈ ప్రపంచకప్‌లో తొలిసారి తన బ్యాట్‌కు పదును చెప్పాడు. 48 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు కెప్టెన్‌ ఆండ్రూ బాల్బర్నీ 37 పరుగులు, లోర్కాన్‌ టక్కర్‌ 45 నాటౌట్‌ రాణించారు. 

చదవండి: WI Vs IRE: పేరుకే రెండుసార్లు చాంపియన్‌.. మరీ ఇంత దారుణంగా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement