నేను అతడికి బిగ్‌ ఫ్యాన్‌.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్‌ Opener Abhishek Sharma Credits Skipper Pat Cummins | Sakshi
Sakshi News home page

నేను అతడికి బిగ్‌ ఫ్యాన్‌.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్‌

Published Thu, May 9 2024 6:41 PM | Last Updated on Thu, May 9 2024 7:16 PM

Opener Abhishek Sharma Credits Skipper Pat Cummins

ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యువ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా బుధ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ విధ్వంసం సృష్టించాడు. 

కేవలం 28 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్‌.. 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌(30 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి ఊచకోత ఫలితంగా సన్‌రైజర్స్ ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ కేవలం 9.4 ఓవర్లలో ఊదిపడేసింది. 

ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 205 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 401 పరుగులు చేశాడు. ​ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సపోర్ట్ కారణంగానే ఈ తరహా ప్రదర్శన చేయగల్గుతున్నానని అభిషేక్ తెలిపాడు. 

"మా కోచింగ్‌ స్టాప్‌, కెప్టెన్‌ పాట్‌ కమ్మిన్స్‌ ఆటగాళ్లందరకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఎటువంటి కెప్టెన్‌ను, సపోర్ట్‌ స్టాప్‌ను ఇప్పటివర​కు చూడలేదు. స్వేచ్చగా ఆడి మమ్మల్ని మేము వ్యక్తిపరిచేందుకు ఫుల్‌ సపోర్ట్‌ వారి నుంచి మాకు ఉంటుంది. 

ఇటువంటి వాతావరణం మా జట్టులో ఉండడం చాలా సంతోషం. ఈ తరహా బ్యాటింగ్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా చేశాను. భారీ షాట్లు ఆడి బౌలర్‌ను ఒత్తడిలోకి నెట్టేందుకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. 

ఇక ట్రావిస్‌ హెడ్‌కు నేను వీరాభిమానిని. అతడితో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ట్రావిస్‌ స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో అతడి ఆడిన షాట్లు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే" అని జియోసినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్‌ పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement