వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు? | Naseem Shah fined 10 per cent of match fee for kicking stumps | Sakshi
Sakshi News home page

PSL 2024: వికెట్లను కాలితో తన్నాడు.. ఫలితం అనుభవించాడు?

Published Mon, Mar 11 2024 12:57 PM | Last Updated on Mon, Mar 11 2024 1:23 PM

Naseem Shah fined 10 per cent of match fee for kicking stumps - Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024 ప్లే ఆఫ్స్‌కు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆర్హత సాధించింది. ఆదివారం ముల్తాన్‌ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇస్లామాబాద్.. తమ ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇస్లామామాబాద్‌ విజయంలో మున్రో(84), ఇమాద్‌ వసీం(30) కీలక పాత్ర పోషించారు.

నసీం షాకు బిగ్‌ షాక్‌..
ఇస్లామామాబాద్‌ స్టార్‌ పేసర్‌ నసీం షాకు ఊహించని షాక్‌ తగిలింది. ఈ మ్యాచ్‌లో పీఎస్‌ఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు నసీంకు మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు. షా లెవెల్‌1 అత్రికమణకు పాల్పడ్డాడని, ఈ విషయంలో మ్యాచ్‌ రెఫరీదే తుది నిర్ణయమని పీఎస్‌ఎల్‌ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఏం చేశాండంటే?
ముల్తాన్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసే బాధ్యతను కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ను నసీం షా అప్పగించాడు. కెప్టెన్‌ నమ్మ​కాన్ని షా వమ్ము చేయలేదు. అద్భుతంగా బౌలింగ్‌ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడ వరకు అంతబాగానే ఉన్నప్పటికి ఓవర్‌ పూర్తి అయిన వెంటనే నసీం తన కాలితో స్టంప్స్‌ను తన్నాడు. ఈ విషయాపై అంపైర్‌లు మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా అతడిపై ఈ చర్యలు తీసుకున్నాడు.
చదవండిధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్‌ సిక్స్‌ హిట్టర్‌ అతడే: ద్రవిడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement