ఎస్ఆర్‌హెచ్‌తో ముంబై కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ Mumbai win Toss to bowl vs Sun Risers Hyderabad | Sakshi
Sakshi News home page

IPL 2024: ఎస్ఆర్‌హెచ్‌తో ముంబై కీల‌క పోరు.. కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ

Published Mon, May 6 2024 7:16 PM | Last Updated on Mon, May 6 2024 7:28 PM

Mumbai win Toss to bowl vs Sun Risers Hyderabad

ఐపీఎల్‌-2024లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. ముంబై ఇండియ‌న్స్ త‌రపున అన్షుల్ కాంబోజ్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. మ‌రోవైపు ఎస్ఆర్‌హెచ్ తుది జ‌ట్టులోకి మ‌యాంక్ అగ‌ర్వాల్ వ‌చ్చాడు.

ఈ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్‌కు చాలా కీల‌కం. ఈమ్యాచ్‌లో ముంబై ఓట‌మి పాలైతే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మిస్తోంది.

తుది జ‌ట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement