సింధు శుభారంభం Mixed results for the Indian players on the first day | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Published Wed, Mar 13 2024 3:56 AM | Last Updated on Wed, Mar 13 2024 3:56 AM

Mixed results for the Indian players on the first day - Sakshi

తొలి రౌండ్‌లోనే ప్రణయ్, శ్రీకాంత్‌ పరాజయం  

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల  సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. వ్యోన్‌ లీ (బెల్జియం)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సింధు తొలి గేమ్‌ను 14 నిమిషాల్లో 21–10తో సొంతం చేసుకుంది.

ఈ దశలో గాయం కారణంగా వ్యోన్‌ లీ వైదొలగడంతో సింధును విజేతగా ప్రకటించారు. ఆకర్షి కశ్యప్‌ 16–21, 11–21తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత  నంబర్‌వన్, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 21–14, 13–21, 13–21తో సు లీ యాంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు.

ప్రపంచ నంబవర్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన  మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 9–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఏ దశలోనూ డెన్మార్క్‌ స్టార్‌కు పోటీనివ్వ లేకపోయాడు. అక్సెల్‌సన్‌ చేతిలో శ్రీకాంత్‌కిది 11వ ఓటమి కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement